WTC 2021-2023 New Points System: As per the updated system, each Test match will now carry a weightage of 12 points while a drawn and tied Test will fetch 4 and 6 points respectively.
#WTC2021-2023
#WTCNewPointsSystem
#WTCFixtures
#ICC
#INDVSENG
క్రికెట్ చరిత్రలో తొలిసారి నిర్వహించిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) గత నెలలో ఘనంగా ముగిసింది. విశ్వవిజేతగా న్యూజిలాండ్.. రన్నరప్‌గా భారత్ నిలిచాయి. దాంతో ఇప్పుడు అందరి దృష్ఠి డబ్ల్యూటీసీ-2పై పడింది. ఇది 2021-2023 మధ్య జరగనుంది. దీనికోసం కొత్త పాయింట్ల వ్యవస్థను, ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు, ఏ ఏ జట్లు ఆడబోతోందన్న షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం రిలీజ్ చేసింది. డబ్ల్యూటీసీ-2లో సిరీస్‌లోని మ్యాచ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా.. గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు 12 పాయింట్లు ఇవ్వబడతాయి. పర్సెంటేజ్ పాయింట్ల రూపంలో చెప్పాలంటే 100. ఒకవేళ టై అయితే 6 (50 పర్సెంటేజ్ పాయింట్లు), డ్రా అయితే 4 (33.33 పర్సెంటేజ్ పాయింట్స్) పాయింట్లు కేటాయించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.